Monday, November 18, 2024

ఉల్లి ధరలు ‘ఢమాల్’

తెలుగు రాష్ట్రాలలో ఉల్లిపాయల ధరలు భారీగా పడిపోయాయి. బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్ ఉల్లిపాయల ధర రూ.800కు పడిపోయింది. కర్నూలు, హైదరాబాద్ మార్కెట్లకు భారీగా ఉల్లి రాగా.. కనీసం రూ.1500 గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారులు రూ.800కు మించి మద్దతు ధర ఇవ్వకపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నెలరోజుల క్రితం వరకు కిలో రూ.50-70 పలికిన ఉల్లిపాయల ధర ఉన్నట్టుండి పడిపోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.100కు 5-6 కేజీల ఉల్లిపాయలు లభిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement