Thursday, November 21, 2024

కొనసాగుతున్న రష్యా దాడులు

తూర్పు ఉక్రెయిన్‌, మ రియపోల్‌ ప్రాంతాలపై రష్యా దాడులు ముమ్మరం చేసింది. ప్రత్యేకించి సాధారణ పౌరులను తరలించడంతో మరియపోల్‌లోని అజోవత్సల్‌ స్టీల్‌ప్లాంట్‌లో మోహరించిన ఉక్రెయిన్‌ సైనికులే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. తమ వారిని రక్షించాలని కోరుతూ సైనికుల బంధువులు మరియపోల్‌లో ప్రదర్శనలు నిర్వహించారు. కాగా తూర్పు ఉక్రెయిన్‌లోని డోనెట్‌స్క్‌, లైమాన్‌, బఖ్‌ముత్‌, ఖార్కీవ్‌ ప్రాంతాలపై పెద్దఎత్తున దాడులు చేసింది. మరియపోల్‌ల స్టీల్‌ప్లాంట్‌నుంచి సురక్షితంగా బయటపడ్డ పౌరులు ఆశ్రయం పొందుతున్న మరో పెద్దనగరం జరోరిరి&ురి&ుయా, నోవోపావలోవ్‌స్క్‌లపై శతఘ్నులతో దాడులు చేసింది.

ఉక్రెయిన్‌కు ఈయూ ఆర్థికసాయం
రష్యాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని యూరోపియన్‌ యూనియన్‌ మరోసారి ప్రకటించింది. అందుకు వీలుగా 500 మిలియన్‌ యూరోల సాయాన్ని అందిస్తామని శుక్రవారం ఈయూ విదేశాంగ విధాన విభాగం ప్రధానాధికారి జోసెప్‌ బోర్రెల్‌ ప్రకటించారు. ప్రత్యేకించి ఈ మొత్తం సైనిక, ఆయుధ అవసరాల కోసం వినియోగిస్తారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement