స్టాక్ మార్కెట్లు వరసగా నాలుగో రోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్లు బుధవారం నాడు రోజంతా ఒడుదొడుకుల మధ్య ట్రేడింగ్ కొనసాగింది. చివరలో అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు నష్టాల్లో ముగిసింది. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు అంశం మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 సంవత్సరాల గరిష్టానికి చేరడంతో పెంపుదల ఎక్కువగానే ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అంచనాల వల్లే విదేశీ మదుపర్లు మార్కెట్లో భారీగా అమ్మకాలు జరుపుతున్నారు. దేశీయంగా కూడా ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో మార్కెట్ సెంట్మెంట్ను దెబ్బతిస్తోంది. ఫలితంగానే సూచీలు వరసగా నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఉదయం సెన్సెక్స్ 52,650.41 వద్ద ప్రారంభమైంది. చివరకు 152.18 పాయింట్ల నష్టంతో ముగిసింది.
నిఫ్టీ 39.95 పాయింట్లు నష్టపోయి 15,521.15 వద్ద ముగిసింది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, మారుతి, ఎం అండ్ ఎం షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, రిలయన్స్, హచ్‌యూఎల్, విప్రో, టెక్ మహేంద్రా, పవర్ గ్రిడ్, ఐటీసీ, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, హెచ్సిీఎల్, కొటాక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. బంగారం 10 గ్రాముల ధర 353 రూపాయలు పెరిగి 50548 వద్ద ముగిసింది. వెండి కేజీ 1329 రూపాయల పెరిగి 60,830 వద్ద ట్రేడ్ అయ్యింది. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ 77.89 వద్ద ట్రేడ్ అయ్యింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.