శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. రిజర్వాయర్‌లోకి 83,030 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరగా, ప్రాజెక్టు నుండి 12 గేట్ల ద్వారా గోదావరి నదిలోకి 74,880 క్యూసెక్కుల నీటినీ విడుదల చేస్తున్నారు. కాకతీయ కాల్వ ద్వారా 2000, ఎస్కేప్ గేట్ల ద్వారా 6000, సరస్వతీ కాల్వ ద్వారా 100, లక్ష్మి కాల్వ ద్వారా 50 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90 టీఎంసీలు కాగా బుధవారం సాయంత్రానికి 1091 అడుగులు 90.313 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు తెలిపారు.
గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టులో 1091 అడుగులు 90.313 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు తెలిపారు. ఈ సీజన్‌లో జూన్ 1వ తేదీ నుండి ఇప్పటి వరకు 373.523 టీఎంసీల వరద నీరు వచ్చి చేరగా 303.283 టీఎంసీల నీటిని ప్రాజెక్టు నుండి విడుదల చేసినట్లు అధికారులు వివరించారు.