ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ మూడో త్రైమాసికంలో నికర లాభం 26 శాతం పెరిగి 11,045 కోట్లుగా నమోదైంది. గ్యాస్ ధరలు పెరగడంతో కంపెకనీ లాభంలో పెరుగుదల నమోదైంది. సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చితే ఓఎన్జీసీ లాభం 13.88 శాతం తగ్గింది. ఆ త్రైమాసికంలో 12,826 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం నికర లాభం 28,474 కోట్లతో పోల్చితే ఈ త్రైమాసికంలో ఆదాయం 35.5 శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో ఓఎన్జీసీ ఆదాయం 38,584 కోట్లుగా నమోదైంది. ప్రభుత్వం గ్యాస్ ధరను 41 శాతం పెంచి ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 8.57 డాలర్లుగా చేసింది. దీంతో ఈ విభాగంలో ఓఎన్జీసీ గ్యాస్ రియలైజేషన్ 195 శాతం పెరిగింది.
ముడి చమురు ధర 15 శాతం పెరిగి బ్యారెల్‌కు 87.13 డాలర్లుగా ఉంది. విండ్‌పాల్ ట్యాక్స్ తరువాత ఇది 84.9 డాలర్లుగా ఉంది. కంపెనీ షేర్ హోల్డర్లకు మధ్యంతర డివిడెండ్‌ను 4 రూపాయలు ప్రకటించింది. మొత్తం షేర్ హోల్డర్లకు 5,032 కోట్లు చెల్లించనుంది. ఓఎన్జీసీ ప్రతి రోజు 1.26 మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తోంది. దేశీయ చమురు ఉత్పత్తిలో ఓఎ న్జీసీ 71 శాతం వాటా కలిగి ఉంది. సంస్థకు 15 దేశాల్లో 35 ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి.