దేశంలోనే ఆయిల్, గ్యాస్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థగా ఉన్న ఓఎన్‌జీసీ విండ్ పాల్ ప్రాఫిట్ ట్యాక్స్ రద్దు చేయాలని కోరుతోంది. ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి అవుతున్న ముడి చమురుపై విండ్‌పాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గినందున ఈ మేరకు ప్రభుత్వం ఈ పన్నును రద్దు చేయాలని కోరుతోంది. సహాజ వాయివుపై మిలియన్ బ్రిటిష్ థర్మల్‌కు 10 డాలర్లు ఉండాలని కూడా ఓఎన్‌జీసీ కోరుతోంది.
దేశీయంగా ముడి చమురు ఉత్పత్తిపై విండ్‌పాల్ పన్ను విధిస్తూ, రష్యా నుంచి డిస్కౌంట్ రేటులో చమురు దిగుమతి చేసుకోవడం సరైందికాదని ఓఎన్‌జీసీ స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వ అధికారులతో ఓఎన్‌జీసీ చర్చలు జరిపింది. రష్యా నుంచి తక్కువ రేటులకు చమురు కొనుగోలు చేయడం ద్వారా 35 వేల కోట్లు మిగిలాయని, ఈ నిధులను ఓఎన్‌జీసీకి బదలాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ నిధులను దేశీయంగా చమురు నిల్వల అన్వేషణకు ఉపయోగిస్తామని తెలిపింది.