Tuesday, November 19, 2024

య‌మ‌జోరు మీదున్న వన్​ప్లస్.. ఈ నెల‌లో తొలి ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫో, త్వ‌ర‌లోనే వన్​ప్లస్​ 12 లాంచ్

వన్​ప్లస్​ సంస్థ త‌మ కంపెనీ నుంచి తాజాగా తొలి ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్ ను ఈ నెల 19న అంతర్జాతీయంగా​ లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఈ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​ తో పాటు మ‌రో కొత్త స్మార్ట్​ఫోన్ ను​ రిలీజ్ చేసే ప్ర‌య‌త్నాలు కూడా కంపెనీ చేస్తోంది కంపెనీ. వన్​ప్లస్ నుంచి త్వ‌ర‌లో మార్కెట్లోకి వన్​ప్లస్​ 12 రానున్న‌ట్టు తెలుస్తోంది. కాగా, ఈ ​అప్ క‌మింగ్ స్మార్ట్​ఫోన్ కి సంబంధించి ప‌లు ఫీచ‌ర్లు ఇప్ప‌టికే ఆన్ టైలైన్ లో లీక్ అయ్యాయి.. ఆ వివ‌రాలు ఏంటో ఓ సారి లుక్కేద్దాం..

వన్​ప్లస్ 12​ ఎలా ఉండ‌బొతుంది!?

లీక్​ అయిన డేటా ప్రకారం.. వన్​ప్లస్​ 12 డిజైన్​ వన్​ప్లస్​ 11ని పోలి ఉంటుంది. అంటే ఇందులోసెంటర్​ అలైన్డ్​ పంచ్​ హోల్​ కటౌట్, అండర్​-డిస్​ప్లే ఫింగర్​ప్రింట్​ స్కానర్​, అలర్ట్​ స్లైడర్​లు వస్తాయని అర్థం చేసుకోవచ్చు. ఇక‌, ఈ మొబైల్ 6.82 ఇంచ్​ ఎల్​టీపీఓ డిస్​ప్లే తో రానున్న‌ట్టు తెలుస్తోంది. 1440×3126 పిక్సెల్స్​, క్యూహెచ్​డీ+ రిసొల్యూషన్​, 2600 నిట్స్​ బ్రైట్​నెస్​ వంటివి స్క్రీన్​కి రిలేటెడ్​ ఫీచర్స్​గా ఉంటాయని తెలుస్తోంది.

అంతేకాకుండా.. కెమెరా సెటప్​లో ఈసారి కంపెనీ భారీ మార్పులే చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ వన్​ప్లస్​ 12 రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 50ఎంపీ అల్ట్రా-వైడ్​, 64ఎంపీ ఓమ్నీవిజన్​ లెన్స్​తో కూడిన ట్రిపుల్​ కెమెరా ఉండబోతోందని టాక్​ నడుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

అలాగే, ఈ వన్​ప్లస్​ కొత్త గ్యాడ్జెట్​లో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3 ప్రాసెసర్​ ఉంటుందని రూమర్స్​ ఉన్నాయి. 16జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ (బేస్​ వేరియంట్​) ఉండే అవకాశం ఉందని సమాచారం. ఆండ్రాయిడ్​ 14 ఆధారిత ఆక్సీజెన్​ఓఎస్​14పై ఈ మోడల్​ పనిచేస్తుంది. శాటిలైట్​ కనెక్టివిటీ కోసం స్నాప్​డ్రాగన్​ ఎక్స్​75 మోడెమ్​ వస్తుందని తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్​ఫోన్​లో 5,400ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుందని, 100వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​కి ఇది సపోర్ట్​ చేస్తుందని, వయర్​లెస్​ ఛార్జర్​ కూడా వస్తుందని పలు లీక్స్​ సూచిస్తున్నాయి.

ఈ వన్​ప్లస్​ కొత్త స్మార్ట్​ఫోన్​ లాంచ్​ ఎప్పుడు..?

కాగా, వన్​ప్లస్​ 12 కోసం స్మార్ట్​ఫోన్​ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మోడల్​.. 2023 డిసెంబర్​ లేదా 2024 జనవరిలో లాంచ్​ అవుతుందని సమాచారం. ఇక ఈ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధరకు సంబంధించిన ఇతర వివరాలపై అఫిషియ‌న్ అనౌన్స్ మెంట్స్ రావాల్సి ఉంది. త్వరలోనే వీటిపై ఓ స్పష్టత వ‌చ్చే చాన్స్ ఉంద‌ని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement