ప్రముఖ స్మార్ ఫోన్ కంపెనీ OnePlus రీసెంట్ గానే OnePlus 11 5G మొబైల్ ను ఇండియన్ మార్కెట్ లో రిలీజ్ చేసింది. దాంతో పాటే OnePlus బడ్స్ ప్రో 2, OnePlus 11R 5G, OnePlus Bus Pro 2, OnePlus TV Q2 Pro, OnePlus Pad అండ్ OnePlus 81 ప్రో కీబోర్డ్‌ను లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు, కంపెనీ భారతదేశంలోని 7 ప్రధాన నగరాల్లో కొన్ని పాప్-అప్‌ల ఈవెంట్స్ ను ఏర్పాటు చేయనుంది. దానికి సంభందించిన షెడ్యూల్‌ను వెల్లడించింది. ఈ పాప్-అప్ ఈవెంట్ లో, సరికొత్త OnePlus 11 5Gని కొనుగోలు చేసిన మొదటి 11 మంది వ్యక్తులు OnePlus ఉత్పత్తులు, సరుకులకు ప్రత్యేకమైన ఆఫర్లు ఉంటాయి.
కాగా, రేపు (11 ఫిబ్రవరి) ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ, పూణే, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్‌లో 11గంటల నుండి ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ లో కొత్తగా ఆవిష్కరించిన ఉత్పత్తులను అనుభవించే అవకాశాన్ని OnePlus వినియోగదారులు పొందుతారు. అలాగే ఫిబ్రవరి 11, 16 తేదీల్లో యూరప్‌లో (కోపెన్‌హాగన్, డెన్మార్క్, హెల్సింకి మరియు ఫిన్‌లాండ్), ఫిబ్రవరి 11న న్యూయార్క్‌లో ఈ గ్లోబల్ పాప్-అప్ ఈవెంట్‌లు ఉంటాయని కంపెనీ వెల్లడించింది.
ఆఫర్‌లు, ధరలు
ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, EMI లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే OnePlus 11 5Gపై రూ.1,000 తక్షణ తగ్గింపు. OnePlus 11 5Gలో ప్రధాన క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేస్తే 12 నెలల వరకు నో-కాస్ట్ EMI. 4G OnePlus లేదా iOS డివైజ్ నుండి OnePlus 11 5Gకి అప్‌గ్రేడ్ చేసినప్పుడు వినియోగదారులు రూ.6000 విలువైన అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు.
OnePlus-Jio offers
అదనంగా, జియో రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తో రూ.11,200 వరకు విలువైన ప్రత్యేక ఆఫర్‌లను పొందవచ్చు. ఈ ఆఫర్ కింద, స్నేహితులు/కుటుంబం కోసం ఒక అదనపు SIMతో పాటు నెలకు 150GBతో Netflix, Amazon Prime అండ్ Jio TV బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేయగలరు. అంతేకాకుండా, Ixigo, EazyDinerలో రూ.3,200 వరకు విలువైన అదనపు బెనిఫిట్స్ కూడా కస్టమర్‌లు పొందవచ్చు. జియో వినియోగదారులందరికీ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. OnePlus 11 వినియోగదారులు JioGames యాప్‌లో హై-ఎండ్ క్లౌడ్ గేమింగ్‌ను కూడా అనుభవించవచ్చు.
అదనంగా, మీరుగనక ఫిబ్రవరి 7న జరిగిన OnePlus Cloud 11 ఈవెంట్‌కు హాజరైనట్లయితే, సరికొత్త OnePlus 11 5G కొనుగోలుపై రూ.999 తగ్గింపు లబిస్తోంది. అయితే మీరు పాప్-అప్ ఈవెంట్‌కు మీ OnePlus Cloud 11 నెక్-ట్యాగ్‌ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ని ఒక్కో యూజర్‌కు ఒకసారి మాత్రమే పొందగలరు.