గ్లోబల్‌గా గత నెల విడుదలైన వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5జీ ఎట్టకేలకు ఇండియాలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. అతి త్వరలో ఈ మొబైల్‌ను ఇండియాలో విడుదల చేయనున్నట్టు అధికారిక ట్విట్టర్ ఎకౌంట్ లో ఈ విషయాన్ని ప్రకటించింది వన్‌ప్లస్. వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5జీ ఫోన్‌ను భారత్‌లో త్వరలో విడుదల చేయనున్నట్టు ప్రకటించగా.. జూలై 1న ఈ మొబైల్ లాంచ్ ఉంటుందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించారు. మరిన్ని లీక్‌లు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
కాకపోతే వన్‌ప్లస్ నుంచి ఇంకా అధికారిక డేట్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. అయితే ఇప్పటికే ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5జీ కోసం ప్రత్యేకమైన పేజీ ఏర్పాటైంది. కాగా వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5జీ 4500mAh బ్యాటరీతో రానుంది. 80వాట్ల SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉండే వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5జీ వేరియంట్ ధర భారత్‌లో రూ.28,999 ఉంటుందని అంచనా వెలువడుతున్నాయి. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఉండే టాప్ వేరియంట్ ధర రూ.33,999గా ఉంటుందని లీక్‌లు వచ్చాయి. యూరప్‌లో ఈ మొబైల్ బేస్ మోడల్ ధర 399 యూరోలు (సుమారు రూ.33,000)గా ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.