ఈ మధ్య కాలంలో ప్రిమియం స్మార్ట్ఫోన్స్తో పాటు ఫోల్డెబుల్ మొబైల్స్‌కి కూడా మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇండియాలో కూడా కస్టమర్లు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. సంస్థలు కూడా పోటీపడి మరీ ఫోల్డెబుల్ డివైజ్‌లను లాంచ్ చేస్తున్నాయి. కాగా, వన్ ప్లస్ సంస్థ నుంచి కూడా త్వరలో ఓ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ రానుంది. వన్‌ప్లస్ సంస్థ నుంచి భారత్‌లో తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది.
వన్‌ప్లస్ ఓపెన్ పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను ఇటీదలే ఆన్‌లైన్ విడుదల చేసింది కంపెనీ. ఈ వన్‌ప్లస్ ఓపెన్.. ఈ నెల 19న అంతర్జాతీయంగా లాంచ్కానుంది. ఇక అదే రోజు ఇండియాలో కూడా లైవ్ ఈవెంట్లో ఈ మోడల్‌ను విడుదల చేయనున్నారు. కాగా, వన్ ప్లస్ ఓపెన్ స్మార్ట్ ఫోన్ ధరకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి..
ఈ ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్ ధర ఎంతంటే..
సంస్థ నుంచి వస్తున్న తొలి ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్ కావడంతో.. ఈ ‘ఓపెన్’పై భారీ ఆశలే పెట్టుకుంది వన్‌ప్లస్. అందుకే లాంచ్‌ని కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అక్టోబర్ 19 రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ముంబైలో లైవ్ ఈవెంట్ జరగనుంది. ఇక ఈ మోడల్ ధర రూ.1,39,999 ఉండనున్నట్టు తెలుస్తోంది.
అక్టోబర్ 27 నుంచి సేల్స్ మొదలు కానున్నట్టు సమాచారం. అయితే, ఈ మోడల్ ధర, ఫీచర్స్పై ప్రస్తుతం రూమర్స్ మాత్రమే ఉన్నాయి. వీటిని సంస్థ ధ్రువీకరించలేదు. ఈ నేపథ్యంలో.. ఈ నెల 19న జరగనున్న ఈవెంట్‌తో ఈ వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్‌పై ఓ క్లారిటీ వచ్చేస్తుంది.
కొత్త ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉంటుంది..?
పలు లీక్స్ ప్రకారం..వన్‌ప్లస్ ఓపెన్‌లో 7.8 ఇంచ్ 2కే ఇన్నర్ అమోలెడ్ డిస్ప్లే ఉండనున్నట్టు తెలుస్తోంది. దీని రిఫ్రెష్ రేట్ కూడా 12హెచ్జేడ్. ఈ గ్యాడ్జెట్లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది. ఈ డివైజ్‌లో.. 16జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ ఉంటుంది.
వన్‌ప్లస్ కొత్త మొబైల్లో 4,800ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని టాక్ నడుస్తోంది. 67వాట్ ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుందట! 48జీబీ ప్రైమరీ, 48ఎంపీ అల్ట్రా-వైడ్, 64ఎంపీ పెరిస్కోప్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్.. రేర్‌లో ఉంటుందని సమాచారం. వీటితో ఫొటోలు అద్భుతంగా వస్తాయి! ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32ఎంపీ లేదా 20ఎంపీ ఫ్రెంట్ కెమెరా వచ్చే అవకాశం ఉంది.