Monday, November 18, 2024

పెండింగ్‌ ఆస్తిపన్ను రాబట్టేందుకు వన్‌ టైమ్‌ స్కీం.. జీహెచ్​ఎంసీలో 1626కోట్ల బకాయిలు

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి : పేరుకు పోయిన ఆస్తిపన్ను బకాయిలను త్వరితగతిన రాబట్టేందుకు సర్కార్‌ వన్‌టైమ్‌ స్కీమ్‌(ఓటీఎస్‌) పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ మేరకు జీవో నెంబర్‌ 485 జారీ చేశారు. 2021-22 సంవత్సరానికి కలిపి పేరుకు పోయిన బకాయిలను అక్టోబర్‌ 31లోపు ఒకేసారి చెల్లిస్తే 90శాతం ఆస్తిపన్నుపై వడ్డీని మాఫీ చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2021-22 సంవత్సరానికి రూ.1626 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.

విస్తృతంగా ప్రచారం కల్పించడంతో పాటు, బకాయిలను చెల్లించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. గతంలో ఎర్లీబర్డ్‌ పేరిట తీసుకొచ్చిన పథకానికి విశేష స్పందన వచ్చిన నేపథ్యంలో ఈ వన్‌ టైమ్‌ స్కీమ్‌ ద్వారా పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను రాబట్టేం దుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి బల్దియా కమిషనర్‌ త్వరలో అధికారులతో సమావేశం నిర్వహించి మార్గ నిర్దేశం చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ వర్గాలు తెలిపాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement