సంక్రాంతి సందర్భంగా ముందే సెలవులు పెట్టుకుని ఊళ్లకు వెళ్లడానికి సిద్ధం అవుతారు ప్రయాణికులు. అలా అన్ని బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రజలను టార్గెట్ చేస్తూ కొన్ని అసాంఘిక టెర్రర్ అటాక్ లకు పాల్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో మంగళవారం ఉదయం తనిఖీలు చేపట్టారు పోలీసులు. కాగా, శ్రీకాళహస్తి ప్లాట్ ఫాం 10, 11 మధ్య పిల్లర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు సూట్‌కేస్ వదిలి వెల్లిపోయారు. బస్టాండ్‌లో సూట్‌కేసు ఒకటి అనుమానాస్పదంగా కనిపించడం.. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి : కేరళలో భార్య మార్పిడి హల్ చల్.. ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు
ప్రయాణికులను అక్కడి నుంచి బయటకు పంపించి అధికారులతో పాటు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత బాంబ్ స్క్వాడ్‌ను పిలిపించారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో బస్టాండ్ ఆవరణలో తనిఖీలు నిర్వహించారు. సూట్‌కేస్‌ను బ్రేక్ చేసిన బాంబ్ స్క్వాడ్.. అందులో ఏమీ లేదని తేలచ్చారు. సూట్‌కేస్‌లో ఏమీ లేకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సూట్‌కేస్ ఎవరిదీ అని తేల్చుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital