తెలంగాణలో గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో లక్ష మందికి కరోనా టెస్టులు చేయడంతో పాటు లక్ష మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు ఆరోగ్యశాఖ అధికారి డా.శ్రీనివాస్ వెల్లడించారు. ప్రజల్లో కరోనా వ్యాక్సినేషన్‌పై అవగాహన పెరిగిందని.. పెద్ద ఎత్తున కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1100 కేంద్రాల్లో పైగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.
అటు తెలంగాణలోని మరో 15 జిల్లా కేంద్రాల్లో ఆర్‌సీపీసీఆర్ టెస్టుల సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం 1,064 కేంద్రాల్లో యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో సెరో సర్వే చేస్తామన్నారు. ప్రభుత్వ పరిధిలోని సుమారు 10వేల పడకల్లో 80 శాతం ఖాళీగానే ఉన్నాయని శ్రీనివాస్ వెల్లడించారు.