Saturday, November 23, 2024

లండన్ లో డేంజర్.. ప్రతి 10 మందిలో ఒకరికి ఒమిక్రాన్.

రోజుకు లక్షన్నరకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. లండన్‌లో చాలా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతీ 10 మందిలో ఒకరు కరోనా బారినపడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 1,22,186 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరికొన్ని రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బ్రిటన్‌ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. డిసెంబర్‌ 16 నాటికి లండన్‌లో ప్రతీ 20 మందిలో ఒకరు కరోనా బారినపడ్డారు. నాలుగు రోజుల వ్యవధిలోనే.. ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది.

ప్రతీ 10 మందిలో ఒకరు కరోనా బారినపడుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. తీవ్రత ఎలా ఉంటుంది? ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య రాబోయే రోజుల్లో పెరుగుతుందా? తగ్గుతుందా? అన్నది ఇప్పట్లో చెప్పలేమని వైద్య నిపుణులు చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో 137 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,02,269కు చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా బాధితుల సం ఖ్య 1,18,91,292కు చేరుకున్నాయి. 99,61,369 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement