హుజురాబాద్‌లో నేడు దళిత బంధు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ అన్ని దినపత్రికలు, మీడియాలలో భారీ ఎత్తున ప్రకటనలు ఇచ్చింది. మరోవైపు హుజురాబాద్‌లోనూ టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌ను దళిత బాంధవుడిగా కొనియాడుతూ గులాబీ పార్టీ నేతలు, కార్యకర్తలు హుజురాబాద్‌లో దారి పొడవునా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు.
అయితే హుజూరాబాద్‌లో దళిత బంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ‘దళిత బాంధవుడు’ పేరుతో సీఎం కేసీఆర్ మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై కలెక్టర్, కరీంనగర్ జిల్లా అని కనిపించింది. ఏకంగా జిల్లా కలెక్టర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడమేంటని చూసిన వారు ఆశ్యర్యపోతున్నారు. అయితే ఈ ఫ్లెక్సీని నిజంగానే కలెక్టర్ ఏర్పాటు చేయించారా లేదా ఆయన పేరును వాడారా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇప్పుడీ ఫ్లెక్సీ హుజూరాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్త కూడా చదవండి: హుజూరాబాద్ గడ్డపై చారిత్రక ఘటం.. నేడే ‘దళిత బంధు’ శ్రీకారం