Tuesday, November 26, 2024

America: విమానం ఇంజిన్‌లో పడి ఒకరు దుర్మరణం..

విమానం ఇంజిన్‌లో పడి ఓ వర్కర్ దుర్మరణం చెందిన ఘటన అమెరికాలోని టెక్సాస్‌లోని శాన్ యాంటోనియో విమానాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డు(ఎన్‌టీఎస్‌బీ) వివరాల ప్రకారం.. లాస్ ఏంజలెస్ నుంచి వచ్చిన డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానం ఎరైవల్ గేటు వద్దకు చేరుకుంటున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. అప్పటికి విమానంలోని ఒక ఇంజిన్ ఆన్‌లోనే ఉంది.

ఈ క్రమంలోనే ఇంజిన్, గాలితోపాటూ వర్కర్‌ను కూడా లోపలికి పీల్చేసుకుంది. దీంతో, అతడు అక్కడికక్కడే మరణించాడు. కాగా, ఈ ఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ విచారం వ్యక్తం చేసింది. తమ గుండె పగిలిందని వ్యాఖ్యానించింది. మృతుడు యూనిఫీ అనే సంస్థలో పనిచేసేవాడు. ఈ సంస్థ విమానాశ్రయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్‌కు సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తోంది. అయితే, ఈ ప్రమాదంలో యూనిఫీ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని నేషనల్ సేఫ్టీ ట్రాన్స్‌పోర్టు బోర్డు తేల్చింది. ఘటన జరిగిన సమయంలో భద్రతాపరమైన నిబంధనల ఉల్లంఘన జరగలేదని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement