వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆడేందుకు భారతజట్టు అహ్మదాబాద్ చేరుకుని బయోబబుల్‌లోకి అడుగుపెట్టింది. టీమిండియా మూడు రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటారని బీసీసీఐ అధికారులు తెలిపారు. తొడ కండరాల గాయంతో దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ విండీస్‌తో జరిగే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
రవిబిష్ణోయ్ ఈ సిరీస్ ద్వారా అరంగేట్రం చేయనున్నాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విండీస్‌తో జరిగే సిరీస్ ద్వారా పునరాగమనం చేయనున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను గెలుచుకుని ఫామ్‌లో ఉన్న విండీస్‌జట్టు భారత్‌లో అడుగుపెట్టనుంది. వెస్టిండీస్‌తో జరిగే తొలి వన్డే ద్వారా భారత్ 1000వన్డేలు ఆడిన తొలిజట్టుగా నిలువనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..