ప్రతి జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు ఉండాలన్నది మంచి కాన్సెఫ్ట్ అని.. వన్ డిస్ట్రిక్ట్ – వన్ ఎయిర్‌పోర్టు ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులపై క్యాంప్ కార్యాలయంలో ఈరోజు సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన్ డిస్ట్రిక్ట్ – వన్ ఎయిర్‌పోర్టు కు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, అన్ని జిల్లాల్లో ఒకే రకంగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన పై దృష్టి పెట్టండి.. బోయింగ్ విమానాలు సైతం ల్యాండింగ్ అయ్యేలా రన్‌వే అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు, రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలని వెల్లడించారు. ఇందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని.. నిర్వహణలో ఉన్న విమానాశ్రయాల విస్తరణ పనులను కూడా ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..