Friday, November 22, 2024

మెటాలో మరోసారి భారీగా లేఆఫ్‌లు.. వచ్చే వారంలో ప్రారంభమయ్యే అవకాశం

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటా మరోసార భారీగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. వచ్చే వారం తొలగించే ఉద్యోగులకు సమాచారం ఇవ్వనున్నట్లు సంబందిత వర్గాలు తెలిపాయి. 2022 నవంబర్‌లోనే మెటా 11 వేల మంది ఉద్యోగులను తొలగించింది. మొత్తం ఉద్యోగుల్లో ఇది 13 శాతం, ఇంత భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి. రెండోసారి కూడా ఇంతే స్థాయిలో తొలగింపులు ఉంటాయని భావిస్తున్నారు. అవసరంలేని బృందాలన్నింటీని తొలగించాలని సంస్థ నిర్ణయించినట్లు వార్త లు వస్తున్నాయి. ఆర్ధిక మాంద్యం భయాలతో ఇప్పటికే చాలా కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.

- Advertisement -

గత సంవత్సరం నుంచి మెటాకు ప్రకటన రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది. దీంతో ఉద్యోగులను లేఆఫ్‌ చేస్తోంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తోంది. అదే సమయంలో మెటా వర్చవల్‌ రియాలిటీ వేదిక మోటావర్స్‌పై భారీగా ఖర్చు చేస్తోంది. దీని పరిశోధన, అభివృద్ధిపై భారీగా ఆర్ధిక వనరులను వెచ్చిస్తోంది. వర్చువల్‌ రియాలిటీ నుంచి ఆదాయం వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. అందుకే సంస్థ ప్రస్తుతం ఉన్న వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాని భావిస్తోంది. మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ పితృత్వ సెలవుల్లో వెళ్లడానికి ముందే రెండో దశ లేఆఫ్‌లు ఉంటాయని చెబుతున్నారరు. 2023ను జుకర్‌బర్గ్‌ ఇయర్‌ ఆఫ్‌ ఎఫిసెన్సీగా ప్రకటించారు. కంపెనీ ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని ఆయన తెలిపారు. దీని ఆధారంగానే లేఆఫ్‌లు ఉంటాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement