టెలికమ్యూనికేషన్ల శాఖ (డీఓటీ) మరోసారి 5జీ స్పెక్ట్రమ్‌ను వేలం వేయాలని భావిస్తోంది. 2024 జనవరి- ఫిబ్రవరి నెలల్లో ఇది ఉండే అవకాశం ఉందని డీఓటీ వర్గాలు వెల్లడించాయి. ఈ సారి 2.5 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నారు. 37 గిగాహెడ్జ్ పైగా ఉండే ఎయిర్ వేస్‌ను వేలం వేస్తారు. మొత్తం 11 బాండ్స్‌లో 600 మెగాహెడ్జ్ నుంచి 37 గిగా హెడ్జ్ వేలంలో ఉంచనున్నారు.
ఈ సారి వేలంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ రెండు కంపెనీలో పాల్గనే అవకాశం ఉందని భావిస్తున్నారు. తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న వోడాఫోన్ ఐడియా ఈ సారి వేలానికి దూరంగా ఉండే అవకాశం ఉంది. మొదటి దఫా వేలంలో 5జీ స్పెక్ట్రమ్‌ను తీసుకున్నప్పటికీ వోడాఫోన్ ఐడియా ఇంత వరకు ఈ సర్వీస్‌లను లాంచ్ చేయలేకపోయింది. నిధుల కొరతే ఇందుకు ప్రధాన కారణం.
2024 నాటికి భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలకు కొన్ని సర్కిల్స్‌లో లైసెన్స్ గడువు తీరనుంది. ఈ సర్కిల్స్‌లో ప్రధానంగా పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్, ఒడిషా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ సర్కిల్స్‌కు ఈ సారి వేలంలో డిమాండ్ చాలా పెరుగుతుందని భావిస్తున్నారు. 2022లో జరిగిన వేలంలో ఉత్తర ప్రదేశ్‌ల సర్కిల్‌కు లైసెన్స్ గడువు తీరిపోవడంలో వేలంలోలో గతం కంటే 80 శాతం అధిక రేటు వచ్చింది.
మొదటిసారి వేలంలో ఎవరూ తీసుకోని స్పెక్ట్రమ్‌ను కూడా ఈ సారి వేలంలో ఉంచుతారు. 5జీ సర్వీస్‌లకు 3300 మెగాహెడ్జ్ బాండ్‌కు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. మొదటి సారి వేలంలో ప్రభుత్వానికి 1,50,173 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. జియో 5జీ కోసం 88,078 కోట్ల రూపాయల విలువపై స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. భారతీ ఎయిర్ టెల్ 43,084 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. వోడాఫోన్ ఐడియా ఇందుకు 18,799 కోట్లు ఖర్చు చేసింది. అదానీ డేటా నెట్‌వర్క్ సంస్థ 212 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది.
ఈ సారి ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ 700 మెగాహెడ్జ్ ,3300 మెగాహెడ్జ్, 26 గిగాహెడ్జ్ బాండ్‌ను కోరుతున్నది. ప్రభుత్వం ఈ స్పెక్ట్రమ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేటాయిస్తే యూజర్లకు ఎంతో మేలు జరుగుతుంది. రెండు ప్రైవేట్ సంస్థలతో పోల్చుకుంటే ప్రభుత్వ రంగ సంస్థ యూజర్లకు తక్కువ రేటుకే 5జీ సర్వీస్‌లను అందించగలదని టెలికం రంగ నిపుణులు సూచిస్తున్నారు.