కరోనా మహమ్మారి మళ్ళీ వ్యాప్తి చెందుతుంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే స్పీడ్ గా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం వర్చువల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు కరోనా కట్టడికి తగిన చర్యలను తీసుకుంటున్నాయి.
మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్, రాత్రి సమయంలో కర్ఫ్యూను విధిస్తూ కరోనాను మహమ్మారి కట్టడికి ప్రయత్నం చేస్తున్నారు. వీటితో పాటు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే కరోనాను కట్టడి చేయవచ్చన్న అంశాల పై చర్చలు జరపనున్నారు. దీంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలను ప్రధానికి వివరించనున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతుంది నేపథ్యంలో కేంద్రం కూడా అప్రమత్తమై ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.