కరోనా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. కొన్ని రోజులుగా సినీ నటులు, ప్రోడ్యూసర్లు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా శనివారం చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేసుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తను హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అందరూ హెల్తీగా ఉండాలని ఆయన కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..