దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1న కరోనా వ్యాక్సిన్ పంపిణీ మూడవ దశ ప్రారంభం కాబోతోంది. అదే రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వ్యాక్సిన్ వేసుకోబోతున్నారు. తొలి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్, రెండవ దశలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు అలాగే ఆ తరువాత 45 ఏళ్లు పైబడిన వారంతా కూడా ఈ వ్యాక్సిన్ ను వేసుకున్నారు.
ఇక ఈ మూడవ దశలో జగన్ కూడా వ్యాక్సిన్ వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఏప్రిల్ 1 గుంటూరు జిల్లా భారత్ పేట లోని 140 వ వార్డు సచివాలయంలో ఉదయం 11 గంటలకు జగన్ వ్యాక్సిన్ తీసుకోబోతున్నారు. అంజలి సంబంధించిన ఏర్పాట్లను సోమవారం ఎంపీ మోపిదేవి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాల గిరి తదితర అధికారులు పరిశీలించారు.