Saturday, November 23, 2024

దక్షిణాఫ్రికాలో పిల్ల‌ల‌పై విరుచుకుపడుతున్న ఒమిక్రాన్‌.. ఐసీఎంఆర్‌ తాజా అధ్యయనంలో వెల్లడి..

తెలంగాణలో సెకండ్‌ వేవ్‌ సమయంలో కొవిడ్‌ బారిన చిన్నారుల్లో 80శాతం మందికి డెల్టా వేరియంట్‌ సోకినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) అధ్యయనంలో వెల్లడైంది. తెలంగాణతోపాటు రాజస్తాన్‌, చత్తీస్‌గడ్‌, పంజాబ్‌, కర్ణాటక తదితర 9 రాష్ట్రాల్లో ఐసీఎంఆర్‌ పిల్లలపై కొవిడ్‌ ప్రభావంపై సర్వే నిర్వహించింది. దేశ వ్యాప్తంగా 583 మంది చిన్నారులపై అధ్యయనం చేయగా అందులో 36 మంది తెలంగాణ నుంచి ఉన్నారు. గతేడాది మార్చి-2020 నుంచి ఈ ఏడాది జులై 2021 వరకు ఐసీఎంఆర్‌ చిన్నారులపై కొవిడ్‌ ప్రభావంపై అధ్యయనం చేసింది. డెల్టా బారిన పడిన చిన్నారుల్లో చాలా ప్రధానంగా జ్వరం, దగ్గు, ముక్క కారడం, గొంతులో గరగర వంటి లక్షణాలు కనిపించాయి. ఐసీఎంఆర్‌ అధ్యయనంలో కొవిడ్‌ బారిన పడిన చిన్నారుల్లో… 55శాతం మంది అబ్బాయిలు కాగా… 45శాతం మంది బాలికలు ఉన్నారు

ప్రస్తుతం ఒమిక్రాన్‌ ఆందోళనల వేళ చిన్నారులను కొవిడ్‌ నుంచి రక్షించుకోవాల్సిన అవసరాన్ని తాజా ఐసీఎంఆర్‌ సర్వే స్పష్టం చేస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్‌ ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం పెద్ద ఎత్తున చిన్నారులు కొవిడ్‌ బారిన పడుతున్నారు. వారిలో అత్యధికులకు ఒమిక్రాన్‌ సోకడంతో తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement