డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వాపస్ తీసుకుంది. విదేశీ ప్రయాణికుల నుంచి పెను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విదేశాల్లో పెద్ద ఎత్తున్న కరోనా న్యూ వేరియంట్ కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్రం తాజాగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు నూతన గైడ్ లైన్స్ జారీ చేసింది. దీనిలో భాగంగానే విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు కూడా పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పై కూడా బ్యాన్ కొనసాగించనున్నట్టు తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement