Friday, November 22, 2024

సెన్సార్ సమస్యలతో OMG 2 పోస్ట్ పోన్..

బీటౌన్ లో విన‌ప‌డుతున్న తాజా నివేదికల ప్ర‌కారం అక్షయ్ కుమార్ OMG-2 మూవీ వాయిదా ప‌డే చాన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. సినిమాపై సెన్సార్ బోర్డ్ 20 కట్స్, కొన్ని మార్పులు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అంతే కాకుండా సినిమాకి ‘ఎ’ సర్టిఫికిట్ ఇచ్చింది. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి తెలిపే ఈ మూవీకి “పెద్దలకు మాత్రమే” అనే సర్టిఫికేట్ వ‌చ్చింది. దీంతో, ఆగస్టు 11న విడుదలకు సిద్దంగా ఉన్న ఈ మూవీని.. సెన్సార్ బోర్డ్ ఆదేశించిన మార్పులపై పోరాడాటానికి నిర్మాతలు సినిమా విడుదలను వాయిదా వేయాలని యోచిస్తున్నారు.

సెన్సార్ బోర్డ్ కమిటీ సిఫార్సు చేసిన మార్పులకు వ్యతిరేకంగా పోరాడాలని, సినిమాకి సరైన ప్రమోషన్‌లను కూడా చేయాల‌ని విడుదల తేదీని ఆగస్టు 11 నుండి మార్చాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సెన్సార్ బోర్డ్ విధించిన క‌ట్స్ కార‌ణంగా సినిమా సారాంశం దెబ్బ తింటుంద‌ని.. అంతే కాకుండి సెన్సార్ బోర్డ్ కమిటీ సినిమాకి ‘ఎ’ స‌ర్టిఫికెట్ ఈవ్వడంపై సినీ నిర్మాత‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అన్ని వ‌య‌స్సుల వారు తెలుసుకోవాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

అయితే ఇప్ప‌టివ‌ర‌కు.. సెన్సార్ బోర్డ్ ఇచ్చిన‌ ఈ నివేదికలపై అక్షయ్ కుమార్, మూవీ దర్శకుడు అమిత్ రాయ్ ఇంకా స్పందించలేదు. OMG 2లో పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ కూడా నటించారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement