గుజరాతీ చాక్లెట్ శాండ్ విచ్ కి ఫిదా అయ్యారు జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా..ఈ మేరకు సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియో క్లిప్పింగ్ ను పంచుకున్నారు. అందులో గుజరాతీ చాక్లెట్ శాండ్ విచ్ తయారుచేయడాన్ని చూపించారు. ఈ వీడియోలో ఓ హృదయాకరంలో ఉన్న బ్రెడ్, బటర్, జామ్, డెయిరీ మిల్క్ చాక్లెట్ తరుము, చీజ్ తురుము, చాకోబార్ పై భాగంలో ఉండే చాక్లెట్ ను ఉపయోగించి శాండ్ విచ్ తయారు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఆ శాండ్ విచ్ ఎలా చేశారో చూశాక మతిపోయిందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. అసలు ఈ శాండ్ విచ్ తయారీకి ఉపయోగించిన పదార్థాల కాంబినేషన్ ను ఎవరు కనిపెట్టారో…? దీని అమ్మకాల సంగతేంటి?” ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను గుజరాతీ వంటకాలను విపరీతంగా ఇష్టపడతానని, కానీ ఈ చాక్లెట్ శాండ్ విచ్ కు అగ్రస్థానం ఇస్తానని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement