Sunday, November 17, 2024

Grand Welcome భారత్ ఓమన్​ సుల్తాన్​ రాక.. రాష్ట్రపతి భవన్‌ వద్ద ఘన స్వాగతం

ఒమన్‌ సుల్తాన్‌ హైతం బిన్‌ తారిక్‌కు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రక్షణ దళాలు ఆయనకు గౌరవ వందనం చేశాయి. హైతం బిన్‌ తారిక్‌ భారత్‌ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఢిల్లీకి చేరుకున్నారు.

దీంతో నిన్న ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్‌ ఆయనను స్వాగతించారు. తారిక్‌ మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజు శనివారం ఆయన రాష్ట్రపతి భవన్‌ చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు లాంఛనప్రాయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ మాట్లాడుతూ.. ‘ఒమన్‌ సుల్తాన్‌ పర్యటన రెండు దేశాల మధ్య స్నేహం, సహకారాన్ని మరింత పెంచుతుంది’ అని ఆయన అన్నారు. తారిక్‌ పర్యటన వల్ల ఒమన్‌, భారత్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది అని ఈమేరకు బాగ్చీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement