Friday, November 15, 2024

Olympics – రెజ్ల‌ర్ వినేష్ ఫోగ‌త్ కు అస్వ‌స్థ‌త‌

వ‌ర్కౌట్స్ చేయ‌డంతో డి హైడ్రాష‌న్
వెంట‌నే పారీస్ హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లింపు
ప్ర‌ధాని మోదీ ఫోన్ .. ఆరోగ్యం ప‌రిస్థితిపై ఆరా

పారిస్ ఒలింపిక్స్ లో ఉన్న భారత రెజ్లర్ వినేశ్ ఫొగ‌త్ అస్వస్థతకు గుర‌య్యారు.. దీంతో ఆమెను హుటాహుటిన పారిస్‌లోని ఆస్పత్రిలో చేర్చారు. కాగా, మహిళల 50 కేజీల విభాగంలో బుధవారం రాత్రి జరిగే ఫైనల్‌లో అమెరికా స్టార్ రెజ్లర్ సారా హిల్డర్‌బ్రాంట్‌తో వినేశ్‌ ఫొగాట్‌ తలపడాల్సి ఉంది. అయితే మంగళవారం రాత్రే తాను ఎక్కువ బరువు ఉన్నానని వినేశ్‌ తెలుసుకున్నారు. బరువు తగ్గడం కోసం రాత్రంతా వర్కౌట్స్ చేశారు. నిద్రాహారాలు మానేసి.. స్కిప్పింగ్, సైక్లింగ్, జాగింగ్ చేశారు.

- Advertisement -

దాంతో రాత్రే కేజీకి పైగా బరువు తగ్గారు. అయినప్పటికీ 100 గ్రాముల బరువు అధికంగా ఉండడంతో అనర్హత వేటు పడింది. రాత్రంతా వర్కౌట్స్ చేయడంతో వినేశ్‌ ఫొగాట్‌ డీహైడ్రేషన్‌కు గురయ్యారు. తీవ్ర అస్వస్థత గురైన ఆమెను భారత ఐఓఏ అధికారులు హుటాహుటిన పారిస్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని సమాచారం. కాగా, ఫోగ‌ట్ అస్వ‌స్థ‌త‌కు గురైన విష‌యం తెలుసుకున్న భార‌త ప్ర‌ధాని మోదీ వెంట‌నే అక్క‌డ ఉన్న భార‌త ఒలింపిక్స్ సంఘం అధ్య‌క్ష‌రాలు పిటి ఉష‌తో మాట్లాడారు.. ఫోగ‌త్ ఆరోగ్య ప‌రిస్థితిపై వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement