గత ఒలింపిక్స్ లో బంగారు పతకాలు విజేత నీరజ్ కు ఈ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ లభించింది. జావిలిన్ త్రో విభాగం లో జరిగిన ఫైనల్స్ లో పాక్ కు చెందిన నదీం బంగారు పతకాన్ని ఎగరేకుపోయాడు. నీరజ్ రెండో స్థానానికి పరిమితమై రజతం గెలుచు కున్నాడు
గోల్డ్ మెడల్ సాధించిన అర్షద్ నదీమ్ పురుషుల జావెలిన్ త్రోలో 92.97 మీటర్ల విసిరి కొత్త రికార్డు సృష్టించాడు. ఇదే అతడి బెస్ట్ త్రో. నీరజ్ గత మార్క్ ను దాటినా నదిమ్ దరిదాపులలోకి చేరుకోలేక పోయాడు. నీరజ్ 89. 45 మీటర్లు మాత్రమే విసిరి సెకండ్ ప్లేస్ కు పరిమితమయ్యాడు . దీంతో సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు..కాంస్య పతకం అండర్సన్ పీటర్స్ కు లభించింది.
నీరజ్ మొత్తం 6 త్రో లు చేస్తే అందులో నాలుగు ఫౌల్స్ చేయడంతో పసిడి కలకు దూరమయ్యాడు.
కాగా, కాగా భారత్ కు ఈ పతకంతో కలిసి మొత్తం ఐదు మెడల్స్ లభించాయి. అందులో ఒక సిల్వర్, నాలుగు కాంస్య లు ఉన్నాయి.
జావిలిన్ త్రో, హాకీ, షూటింగ్ లో ఈ మెడల్స్ లభించాయి.