Friday, November 22, 2024

Olympics – హాకీ లో మనకు కాంస్యం

పారిస్ ఒలింపిక్స్ హాకీ లో భారత్ కు కాంస్య పతకం లభించింది. స్పెయిన్ తో జరిగిన పోరు లో 2- 1 గోల్స్ తో మన జట్టు విజయం సాధించింది.. గత ఒలింపిక్స్ లోనూ కాంస్య గెలుచుకుంది. ఈ పతకం తో భారత్ సాధించిన మెడల్స్ సంఖ్య నాలుగుకి చేరాయి.. ఈ నాలుగు కాంస్య పతకాలు కావడం విశేషం. వాటిలో మూడు మెడల్స్ షూటర్ లు సాధించారు.

గురువారం స్పెయిన్‌ తో హోరాహోరీగా సాగిన పోరులో టీమిండియా 2-1తో కంచుమోత మోగించారు.

తొలి అర్ధ భాగంలో స్పెయిన్ ఆట‌గాడు మార్క్ మిర‌ల్లెస్ పెనాల్టీ కార్న‌ర్‌ను గోల్ పోస్ట్‌లోకి పంపి ఇండియాను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే.. కాసేప‌ట్లో తొలి అర్ధ భాగం ముగుస్తుంద‌నగా కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్న‌ర్‌ను గోల్‌గా మ‌లిచాడు. అంతే.. 1-1తో స్కోర్ స‌మం అయింది.

1-0తో వెన‌క‌బ‌డిన కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ సింగ్ వ‌రుస గోల్స్‌తో ప్ర‌త్య‌ర్థికి భార‌త జ‌ట్టు ద‌డ‌పుట్టించింది. ఆఖ‌ర్లో స్పెయిన్ రెండు గోల్ ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకొని టీమిండియా చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యంతో కాంస్యాన్ని ముద్దాడింది. ఆఖ‌రి ఒలింపిక్స్ ఆడుతున్న గోల్ కీప‌ర్ పీఆర్ శ్రీ‌జేష్‌ కు ఘ‌న‌మైన వీడ్కోలు ప‌లికింది..

- Advertisement -

ప్రధాని మోడీ అభినందనలు

కాంస్య పతకం సాధించిన భారత్ హాకీ జట్టును ప్రధాని మోడీ అభినందించారు. ఈ మేరకు ట్వీట్ చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement