Sunday, November 10, 2024

Olympics – రెజ్లింగ్ లో మ‌రో ప‌త‌కం వేట … సెమీస్ లో అమ‌న్

పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త్ కు మ‌రో ప‌త‌కం ఖామ‌మైంది.. భారత రెజ్లర్ అమన్‌ సహ్రావత్ పురుషుల 57 కేజీల విభాగంలో సెమీస్‌కు చేరాడు. క్వార్టర్స్‌లో అమన్‌ 12-0 తేడాతో అబాకరోవ్ (అల్బేనియా)పై విజయం సాధించాడు. తొలి రౌండ్‌లో మూడు పాయింట్లు సాధించిన అమన్.. రెండో రౌండ్‌లో జోరు పెంచాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. అబాకరోవ్‌ను ఐదుసార్లు కిందపడేసి 10 పాయింంట్లు సాధించి తిరుగులేని ఆధిక్యంలో నిలిచాడు. చివర్లో మరో పాయింట్‌ సాధించి అద్భుతమైన విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లాడు. గురవారం రాత్రి జరగనున్న సెమీస్‌లో హిగుచి (జపాన్‌)ను ఓడిస్తే భారత్‌కు రెజ్లింగ్ కు చేరుకుని గోల్డ్ కోసం పోటీ ప‌డ‌తాడు..

అంతకుముందు అమన్ ప్రిక్వార్టర్స్‌లో 10-0 తేడాతో వాద్లిమిర్‌ (నార్త్ మాసిడోనియా)ని మట్టికరిపించాడు. అమన్‌ ప్రత్యర్థిపై తొలి రౌండ్‌ ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించాడు. మొదటి రౌండ్‌లో వాద్లిమిర్‌ను రెండుసార్లు కిందపడగొట్టి నాలుగు పాయింట్లు సాధించాడు. తర్వాత కూడా జోరు కొనసాగించి మరో రెండు పాయింట్లు రాబట్టాడు. రెండో రౌండ్‌లో కూడా భారత్‌ రెజ్లర్‌కు ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు.

నిరాశపర్చిన అంశు మాలిక్

- Advertisement -

మరోవైపు, మహిళల 57 కేజీల ప్రిక్వార్టర్స్‌లో అంశు మాలిక్ నిరాశపర్చింది. 2-7 తేడాతో హెలెన్ లూయిస్ (అమెరికా) చేతిలో ఓటమి చవిచూసింది. తొలి రౌండ్‌లో అమెరికా రెజ్లర్ రెండు పాయింట్లు సాధించింది. రెండో రౌండ్‌లో ఆమె మరింత జోరు పెంచింది. మాలిక్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. అంశును రెండుసార్లు కిందపడగొట్టి నాలుగు పాయింట్లు సాధించి భారీ ఆధిక్యం సాధించింది. భారత రెజ్లర్ చివర్లో రెండు పాయింట్లు రాబట్టినా ఫలితం లేకపోయింది

Advertisement

తాజా వార్తలు

Advertisement