Tuesday, November 19, 2024

ర్యాగింగ్‌కు నేనూ బాధితురాలినే ఒలింపిక్‌ అథ్లెట్ ద్యుతీ చంద్‌..

ర్యాగింగ్‌ భూతానికి తాను కూడా బాధితురాలినేనని ఒలింపిక్‌ అథ్లెట్‌ ద్యుతీ చంద్‌ పేర్కొంది. భువనేశ్వర్‌లోని హాస్టల్‌లో ఉన్న సమయంలో గడిపిన దుర్భర క్షణాలు, ఎదుర్కొన్న కష్టాల గురించి ప్రముఖ స్ప్రింటర్‌ సోషల్‌ మీడియా వేదికగా ఏకరువు పెట్టింది. 2006 నుంచి 2008 వరకు భువనేశ్వర్‌లోని స్పోర్ట్స్‌ హాస్టల్‌లోనే గడిపినట్లు పేర్కొంది. రెండు రోజుల క్రితం భువనేశ్వర్‌ స్పోర్ట్స్‌ హాస్టల్‌లో సీనియర్ల ర్యాగింగ్‌కు తాళలేక రుచిక అనే డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ద్యుతీ స్పందిస్తూ… ”సీనియర్లు వాళ్ల రూమ్స్‌కు నన్ను పిలిపించుకుని బాడీ మసాజ్‌ చేయమని అడిగేవారు.

వాళ్ల బట్టలు ఉతకమనేవాళ్లు.. ఎదురుచెబితే మరింత హింసించేవాళ్లు… ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకపోయేది. పట్టించుకునే వాళ్లు కాదు, ఫిర్యాదు చేస్తావా అంటూ అధికారులు తిట్టేవారు” అని వాపోయింది. క్రీడాకారులకు ఇలాంటి ఘటనల వల్ల చాలా అసహనానికి గురవుతారని, దాంతో ఆట మీద దృష్టి సారించడం కష్టమని పేర్కొన్నారు. ”హాస్టల్‌లో తాను ఎదుర్కొన్న కష్టాలు, పరాభవాల ఘటనలు నా మీద తీవ్ర ప్రభావం చూపాయి, అది నా మానసిక స్థితిని చాలా ప్రభావితం చేసింది. ఇలాంటప్పుడు ఆట మీద దృష్టి సారించడం చాలా కష్టం” అని ద్యుతీ చంద్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement