Tuesday, November 26, 2024

లాభాల బాటలో ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ఈవీ బస్సుల తయారీ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ 4వ త్రైమాసిక ఆర్ధిక ఫలితాలను ప్రకటించింది. సంస్థ 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 259 విద్యుత్‌ బస్సులను డెలివరీ చేసింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఈ సంఖ్య 563కు పెరిగింది. ప్రస్తుతం కంపెనీ చేతిలో 3,394 బస్సులకు ఆర్డర్‌ చేతిలో ఉందని కంపెనీ తెలిపింది. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 2022-23లో 38 శాతం పెరిగి 368.4 కోట్లుగా నమోదైంది.

ఈ త్రౖౖెమాసికంలో కంపెనీ నికర లాభం 27.81 కోట్లుగా ఉంది. అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది 17.47 కోట్లుగా ఉంది. 2022—23 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం 70.70 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో ఇది 35.70 కోట్లుగాఉంది. అంటే కంపెనీ లాభం 98 శాతం పెరిగిందని ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌ సీఎండీ కెవీ ప్రదీప్‌ తెలిపారు. దేశ క్లీన్‌ మొబిలిటీ ఎజెండాకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement