హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ స్టాండ్ అలోన్ ప్రాతిపదికన జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో రూ.304.7 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ సాధించిన రూ.41.2 కోట్ల ఆదాయంతో పోల్చితే 640.4 శాతం అధికం. ఇక ఈ ఆదాయంపై 18.8 పీఏటీ నికర లాభాన్ని ఆర్జించింది. ఈ త్రైమాసికంలో ప్రధానంగా 169 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయడంతో గణనీయమైన ఆదాయ వృద్ధిని సాధించింది. ఈ త్రైమాసికంలో ప్రధానంగా 169 బస్సులను సరఫరా చేయడంతో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో కేవలం 11 బస్సులను మాత్రమే డెలివరీ చేయగలిగింది. పుణ నగరంలో బస్సుల నిర్వహణ ద్వారా కూడా ప్రస్తుత త్రైమాసికంలో అధిక ఆదాయం నమోదైంది. ఈ-బస్ డివిజన్‌లో 2022 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో రూ.279.4 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
ఇన్సులేటర్ డివిజన్ ఆదాయం రూ.17.8 కోట్ల నుంచి రూ.25.3 కోట్లకు పెరిగింది. దీంతో రెవెన్యూ 42 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఎండీ కె.వి. ప్రదీప్ మాట్లాడుతూ మా అవిశ్రాంత ప్రయత్నాల ఫలితంగా అనుకూలమైన ఫలితాలు వచ్చాయి. గత మూడు నెలల కాలంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ వేగవంతం చేయడంతో పాటు డెలివరీలు రికార్డుస్థాయిలో 169కి పెరిగాయి. ఈ ఊపును కొనసాగించి కొత్త పుంతలు తొక్కడడానికి మరింతగా ప్రయత్నిస్తామని తెలిపారు. వివిధ ఎస్టీయూలకు సకాలంలో ఆర్డర్లు డెలివరీ చేస్తామని చెప్పారు. రానున్న త్రైమాసికాల్లో కొత్త ఉత్పత్తి శ్రేణిని పరిచయం చేయడంతో పాటు మరిన్ని విభాగాల్లోకి ప్రవేశిస్తామని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.