Sunday, November 24, 2024

ఆగస్ట్‌ 1 నుంచి పాత లిక్కర్‌ పాలసీ : మనీష్‌ సిసోడియా..

కొత్త ఎక్సైజ్‌ పాలసీ అమలుపై ఢిల్లి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జనరల్‌ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన కొద్ది రోజుల్లోనే ఢిల్లి సర్కార్‌ ఆ పాలసీపై యూటర్న్‌ తీసుకుంది. తిరిగి పాత ఎక్సైజ్‌ పాలసీనే పునరుద్దరించింది. ఆగస్ట్‌ 1వ తేదీ నుంచి పాత లిక్కర్‌ పాలసీని తిరిగి అమల్లోకి తీసుకు వస్తున్నట్లు ఢిల్లి ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా శనివారం ఢిల్లిలో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సిసోడియా కొత్త ఎక్సైజ్‌ పాలసీని ప్రస్తుతించారు. పాత పాలసీని పునరుద్ధరిస్తున్నందు వల్ల కొత్త పాలసీలో అవినీతి జరిగినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లి ప్రభుత్వం కనుక అధికారికంగా లిక్కర్‌ అమ్మకాలను నిలిపి వేస్తే, కల్తీ విషాదానికి ఢిల్లి నగరం కూడా సాక్ష్యమవుతుందని సిసోడియా అన్నారు.

అటువంటి విషాదానికి ఢిల్లిలో చోటివ్వరాదనే ఉద్దేశ్యంతో పాత పాలసీని పునరుద్ధరించినట్లు సిసోడియా వెల్లడించారు. గుజరాత్‌లో కల్తీసారా తాగి 42 మంది అమాయకులు మరణించిన విషాదఘటనను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సిసోడియా గుర్తు చేశారు. గుజరాత్‌లో మద్య నిషేధం విధించి నా, బీజేపీ నేతల కనుసన్నల్లో కోట్లాది రూపాయల అక్రమమద్యం ఏరులై పారిందని సిసోడియా అన్నారు. ఆ కల్తీసారా తాగి 42 మంది అమాయకులు మృత్యువాత పడ్డారని, పోలీసుల విచారణలో అక్రమ మద్యం రాకెట్‌లో రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నట్లు రుజువైందని ఆయన అన్నారు. కానీ, గుజరాత్‌లో కల్తీ సారాకు అమాయకుల బలవ్వడం ఇది మొదటిసారి కాదని ఆయన అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement