వృద్ధాప్య పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్.. ఆసరా వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు ఉన్న వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయస్సును 65 ఏండ్ల నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో 36, తేదీ: 04-08-2021 ను విడుదల చేసింది.. ఇకపై అర్హులైన 57 ఏళ్ల వారందరికీ కొత్త పెన్షన్లు అందనున్నాయి. గ్రామ స్థాయిలో దరఖాస్తులు స్వీకరించి అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తారు. పింఛన్ వయసు నిర్ధారణకు ఓటరు జాబితా, ఆధార్‌కార్డు, ఇతర ఆధారాలను ప్రామాణికంగా తీసుకుంటారు.
ఓల్డేజ్ పింఛన్ల అర్హత వయసు తగ్గించడంతో రాష్ట్రంలో మరో 6.62 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం పించన్ల సంఖ్య 58 లక్షలకు చేరుకోనున్నది. కుటుంబంలో ఒక్కరికే పింఛన్ పద్ధతిని కొనసాగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భర్త చనిపోతే భార్యకు.. భార్య చనిపోతే భర్తకు వెంటనే పింఛన్‌ను బదిలీ చేయాలన్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో ఆరు రకాలుగా నూతన విద్యావిధానం