Friday, November 22, 2024

ఓలా ఎలక్ట్రిక్‌ ఆధ్వర్యంలో భారీప్లాంట్‌

ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ దేశంలో మరో భారీ ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. సాఫ్ట్‌ బ్యాంక్‌ మద్దతుతో ఓలా ఎలక్ట్రిక్‌ భారత్‌లో బ్యాటరీ సెల్‌ తయారీ కర్మాగారాన్ని 50గిగావాట్‌ (జీడబ్ల్యూహెచ్‌) సామర్థ్యంతో నిర్మించాలని యోచిస్తోంది. 10మిలియన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ఉత్పత్తి చేయడానికి ఓలాకు 40 జీడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం అవసరమవుతుంది. మిగిలిన 10 జీడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కోసం వినియోగించుకోనుంది.

2023నాటికి బ్యాటరీ సెల్‌ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసి రాబోయే 3 నుంచి 4సంవత్సరాల్లో 20జీడబ్ల్యూహెచ్‌కు విస్తరించాలని భావిస్తుంది. కాగా ప్రస్తుతం దక్షిణకొరియా నుంచి బ్యాటరీ సెల్స్‌ను దిగుమతి చేసుకుంటున్న ఓలా అధునాతన సెల్‌ బ్యాటరీ టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టనుందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఓలా ప్రస్తుతం రోజుకు సుమారు వెయ్యి స్కూటర్లును ఉత్పత్తి చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement