పెట్రోల్..డీజిల్, గ్యాస్ ఇలా అన్నింటి ధరలకు రెక్కలు వచ్చాయి..విపరీతంగా పెరిగిపోతున్నాయ్. కాగా ఇప్పుడు ఓ వార్త కాస్త ఊరటని కలిగిస్తోంది. అదే ఆయిల్ ధరలు తగ్గాయన్న వార్త. కార్తీకమాసం ప్రారంభం అవ్వడం చాలు పూజలు..పునస్కారాలతో రాబోయే కాలమంతా పండుగలే పండుగలు. అయితే ఏయే నూనెల ధరలు తగ్గాయో చూద్దాం. అదానీ విల్మార్, రుచి సోయా ఇండస్ట్రీస్‌తో సహా ప్రధాన ఎడిబుల్ ఆయిల్ కంపెనీలు టోకు ధరలను లీటరుకు రూ. 4-7 తగ్గించాయి. ఇతర కంపెనీలు కూడా దీనిని అనుసరిస్తాయని భావిస్తున్నామని పరిశ్రమ బాడీ సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (హైదరాబాద్), మోడీ నేచురల్స్ (ఢిల్లీ), గోకుల్ రీఫాయిల్స్ అండ్ సాల్వెంట్ లిమిటెడ్ (సిధ్‌పూర్), విజయ్ సోల్వెక్స్ లిమిటెడ్ (అల్వార్) గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ లిమిటెడ్, ఎన్‌కె. ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అహ్మదాబాద్) ధర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. హోల్‌సేల్ బల్క్ ధరలను టన్నుకు రూ. 4,000-7,000 (లీటరుకు రూ. 4-7) తగ్గించారు. ఈ సంవత్సరం దేశీయ సోయాబీన్, వేరుశెనగ పంటలు పుంజుకుంటున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement