Monday, September 16, 2024

ఏడాదిలో 100 శాతం పెరిగిన వంటనూనెల ధరలు

వంట నూనె ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీని వల్ల మధ్యతరగతి ప్రజలు, నిరుపేదలు ఇక్కట్లకు గురవుతున్నారు. అసలే కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయి, పనుల్లేక ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు నిత్యావసరాల వ్యయం భరించలేనంతగా మారింది. గత ఏడాది రూ.599గా ఉన్న 5 లీటర్ల వంటనూనె డబ్బా ధర ఈ ఏడాది రూ.1082కి చేరింది. అంటే ఏడాది సమయంలో 100 శాతం ధరలు పెరిగాయి. ధరలు ఈ స్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని సామాన్యులు మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement