Friday, November 22, 2024

భారత్‌పై చమురు ఎఫెక్ట్‌, పెరగనున్న ఇంధన ధరలు.. ద్రవ్యోల్బణం మరింత పైకి

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 100 డాలర్లకు చేరుకున్నాయి. వరల్డ్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియేట్‌ చమురు దర 95 డాలర్ల వరకు పలుకుతున్నది. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 98 డాలర్లపైనే ట్రేడ్‌ అవుతున్నది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఈవిధంగానే ఉద్రిక్తతలు కొనసాగితే.. తరలోనే బ్రెంట్‌ క్రూడాయిల్‌ 125 డాలర్ల వరకు చేరే అవకాశాలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్‌తో సంబంధం ఉన్న ప్రతీ దేశంపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. భారత్‌పై కూడా ప్రభావం ఉంటుంది. యుద్ధమే వస్తే.. చమురు రవాణాకు ఆటంకం ఏర్పడుతుంది.

అధిక చమురు దిగుమతులు చేసుకునే భారత్‌కు ఇక్కట్లు తప్పవనేది నిపుణుల వాదన. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరుగుతున్నా.. దేశీయంగా ఇంధన ధరలు స్థిరంగా ఉండటానికి కారణం ఐదు రాష్ట్రాల అసెంబ్లిd ఎన్నికలే. ధరలు పెరిగితే.. ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై నిర్మలా సీతారామన్‌ కూడా పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు భారత్‌ ఆర్థిక స్థిరతానికి పెను సవాల్‌ అంటూ చెప్పకనే చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement