Friday, November 22, 2024

Exclusive | గూగుల్​ మ్యాప్స్​ని నమ్ముకుంటే ఇట్లుంటది మరి.. నేరుగా గోదాట్లోకే!

దూర ప్రాంతం నుంచి తెలంగాణకు వచ్చిన వచ్చిన ఓ లారీ డ్రైవర్​కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. తనకు దారి తెలియకపోవడంతో గూగుల్​ మ్యాప్స్​పై ఆధారపడి డ్రైవ్​ చేసుకుంటూ వచ్చాడు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన తను సిద్దిపేట జిల్లాలోకి రావడంతో తన ఎండ్​ పాయింట్​ కంప్లీట్​ అయ్యిందనుకున్నాడు. అయితే.. తాను గౌరెల్లి అనే ప్రాంతానికి లోడ్​ తీసుకెళ్లాల్సి ఉంది. కానీ, గూగుల్​ తల్లీ మాత్రం గౌరెల్లి ప్రాజెక్టులోకి దారిచూపించింది.

పైగా అర్ధరాత్రి, అడపాదడపా కురుస్తున్న జల్లులతో కాస్త ఇరిటేట్​గా ఉన్న ఆ డ్రైవర్​ లారీని గూగుల్​ రూట్​ ఆధారంగా నడుపుతూ వెళ్తున్నాడు. తీరా ఆ లారీ నేరుగా గౌరవెల్లి ప్రాజెక్టులోకి దారి చూపించింది. అయితే ఇదంతా తనకు తెలియని ఆ లారీ డ్రైవర్​ తాను కచ్చితమైన డెస్టినేషన్​కి వచ్చాను అనుకున్నాడు. అంతలోనే లారీ నీళ్లల్లో మునుగుతుండడంతో కంగారుపడ్డ లారీ డ్రైవర్​, క్లీనర్​ ఇద్దరూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని నీళ్లలో దూకి ఈతకొట్టుకుంటూ ఒడ్డుకుచేరుకున్నారు. లారి మాత్రం నీళ్లలోనే ఉండిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement