Sunday, November 24, 2024

అయ్యో చిట్టి తల్లి : కూల్ డ్రింక్ అనుకుని పురుగులమందు తాగిన చిన్నారి.. ఆస్పత్రికి తరలిస్తుండగానే అనంతలోకాలకు!!

ఇంట్లో కాళ్ల గ‌జ్జ‌ల స‌ప్పుతో సంద‌డిగా ప‌రుగులు పెట్టింది… చిన్నారికి ఆరేళ్ల వ‌య‌స్సు… ఆట‌లో ప‌డి ఆక‌లినిసైతం మ‌రిచిపోయే వ‌య‌స‌ది.. ఆడుకుంటూ అల‌సిపోయి దాహం వేయ‌డంతో ఇంట్లో ఉన్న బాలిల్ లో కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగేసింది. వెంట‌నే త‌ల్లిదండ్రులు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా…చికిత్సపొందుతూ ఆ చిన్నారి మృతి చెందింది. ఈ హృదయ విధారక ఘటన కొమురంభీం జిల్లా భీంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. శాన్విక త‌ల్లిదండ్రులు రాజేశ్, లావ‌ణ్య‌, కుటుంబ స‌భ్యులు తీవ్ర శోక‌సంద్రంలో మునిగిపోయారు. అయితే ప‌త్తి చేనుకు కొట్టేందుకు రాజేశ్ పురుగుల మందు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. దాంతో ఆ బాలిక ఆడుకుంటూ.. తాగేసింది. శాన్విక తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో.. హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే బాలిక మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే పురుగుల మందును కూల్ డ్రింక్ బాటిల్‌లో ఉంచ‌డంతోనే.. బాలిక అది కూల్ డ్రింక్ అని భావించి, తాగిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement