కరోనా నుంచి కోలుకున్న వారికి ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయటకువచ్చింది. కొవిడ్ నుంచి కోలుకున్న కొందరిలో దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయన్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు మొదటి నుంచి హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ అధ్యయనం మరో సంచలనం విషయం బహిర్గతం చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో జ్ఞాపకశక్తి మందగించిందని తెలిపింది. ఈ వైరస్ మానవుల్లో ప్రధానంగా మానసిక సామర్థ్యాన్ని దెబ్బతీసిందని, ఆ ప్రభావం ఇప్పటికీ ఉంటుందని వివరిస్తున్నారు.
లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ పరిశోధకులు కరోనా బారిన పడి కోలుకున్న 80 వేల మందిపై పరిశోధన చేసి ఈ విషయం స్పష్టం చేశారు. వారికి కనీసంగా చిల్డ్రన్స్ బుక్స్ కూడా చదివి గుర్తు పెట్టుకునేంత జ్ఞాపకశక్తి ఉండటం లేదట. అంతకుమునుపులా వారు తర్కించే చాన్సెస్ తక్కువేనని చెప్తున్నారు. ఈ క్రమంలోనే హెల్త్ పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు. డిఫరెంట్ ఫీల్డ్స్‌లో ఉన్న పలువురు బారిన పడి కోలుకున్న తర్వాత మునుపటి స్టైల్‌లో పని చేయలేకపోతున్నారని కేస్ స్టడీస్ ద్వారా వివరించారు. కొవిడ్ రూపాంతరం చెందుతూ వస్తుండగా, న్యూ వేరియంట్స్ బారిన పడితే దాని ప్రభావం కోలుకున్నాక కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో బయటపడిన డెల్టా వేరియంట్ బారిన పడి అంత త్వరగా కోలుకోవడం లేదు.
ఇది కూడా చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖుల భేటీ..