Friday, November 22, 2024

Breaking | హ‌మ్మ‌య్య‌, క‌డెం ప్రాజెక్టుకు ముప్పు త‌ప్పింది.. ఊపిరి పీల్చుకున్న అధికారులు

నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. ప్రాజెక్టుకు వరద త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ప్రమాదం త‌ప్పింద‌ని అధికారులు అంటున్నారు. ఇవ్వాల (గురువారం) ఉదయం ప్రాజెక్టుకు 3లక్షల క్యూసెక్కులకు పైగా వరద రాగా.. ఉదయం ఆనకట్టపై నుంచి వరద ప్రవహించింది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టులోకి 1.30లక్షల క్యూసెక్కులకు వరద త‌గ్గిన‌ట్టు అధికారులు తెలిపారు.

కాగా, 16 గేట్ల ద్వారా అధికారులు దిగువ‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఉదయం నాలుగు గేట్లు మొరాయించగా.. రెండుగేట్లను ఇంజినీర్లు ఎత్తారు. కడెం ప్రాజెక్టు ప్రస్తుతం ఔట్‌ ఫ్లో 2.30లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇదిలా ఉండగా.. భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి వరద త‌గ్గుముఖం ప‌ట్టింది. ప్రాజెక్టు ఐదుగేట్లు ఎత్తి 92,482 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

- Advertisement -

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద..

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్ర‌వాహం పెరిగింది. ప్రాజెక్టులోకి 2.92ల‌క్ష క్యూసెక్కుల వరద వ‌స్తోంది. ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి 2.5లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 4వేల క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1088.7 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రాజెక్టులోకి ప్రస్తుత నీటిమట్టం 78.66 టీఎంసీలుగా ఉండగా, పూర్తి స్థాయినీటి మట్టం 90 టీఎంసీలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement