వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలోని లీలా ఆసుపత్రిని జిల్లా ఉప వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రకాశ్ సందర్శించారు. గర్భిణీ మృతి, శిశువు జననం శీర్షిక పేరిట ఆంధ్రప్రభ దినపత్రిక కథనం ప్రచురించగా వారు స్పందించారు. ఘటన జరిగిన ఆసుపత్రిని సందర్శించి వివరాలు తెలిసుకున్నారు. ఆసుపత్రికి వచ్చినపుడు గర్భిణీ స్థితి, ఆ తరువాత స్థితిని అధికారులు నమోదు చేసుకున్నారు.
అయితే వైద్యం చేసిన డాక్టర్లు, ఆసుపత్రి వైద్యులు అందుబాటులో లేకపోవడం కారణంగా విచారణను వాయిదా వేశారు. వైద్యులు అందుబాటులో ఉన్నపుడు మళ్లీ ఆసుపత్రికి వస్తామని చెప్పి వెళ్ళారు. ఈ తనిఖీల్లో మండల వైద్యాధికారి అరుణ చంద్ర, సూపర్వైజర్ మరియా రాణి, ఏ ఎన్ ఎం శైలజ పాల్గొన్నారు.