Thursday, September 12, 2024

అక్రమంగా మట్టి తరలింపు పట్టించుకొని అధికారులు

బెజ్జంకి, ప్రభ న్యూస్: వరద కాలువ, చెరువల్లో గల మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా సొంత అవసరాలకు తరలించినప్పటికీ అధికారులు చర్యలు చేపట్టక పోవడంపట్ల ప్రజల్లో పలు ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిదిలోని వీరాపూర్, తోటపల్లి గ్రామ శివారులో గల కెనాల్ కాలువ నుండి మట్టిని తీసి ప్రభుత్వ అవసరాల కోసమని చెబుతూ సొంత నిర్మాణలకు అక్రమంగా తరలిస్తున్నారని మండల కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి ఆరోపించారు.

ఆక్రమంగా మట్టిని తరలించడం పట్ల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొకపోవడం సరికాదని అన్నారు. ఈ సందర్భంగా రవాణాను అడ్డుకోవాలని స్థానిక తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఇప్పటి వరకు జరిగిన అక్రమ మట్టి రవాణాపై విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement