హైదరాబాద్‌లో మళ్లీ వాన మొదలయ్యింది. మూడు, నాలుగు రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం గురువారం సాయంత్రం కాస్త తెరిపినిచ్చింది. అయితే ఆకాశం మాత్రం మేఘాలతో కమ్ముకుని ఉంది. కాగా, సిటీలోని పలు ప్రాంతాల్లో ఇవ్వాల (శుక్రవారం) తెల్లవారుజామున వాన మళ్లీ షురూ అయ్యింది.
హైదరాబాద్‌లోని నిజాంపేట్, కూకట్పల్లి, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోఠి, నాంపల్లి, లక్డీకపూల్, మాసబ్‌ట్యాంక్, ఖైరతాబాద్, పంజాగుట్టా, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాదాపూర్, కొండాపూర్, ఏఎస్ రావు నగర్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. సిటీ వ్యాప్తంగా ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నది. ఇవ్వాల హైదరాబాద్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జర్నీ చేయాలనుకునే వారు వర్షం..