Saturday, November 23, 2024

ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం మహా జాతర

ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం మహా జాతర

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. ఆదివాసి జాతరగా
పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2022, ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు. ఫిబ్రవరి 16వ తేదీ బుధవారం రోజున సారలమ్మ కన్నెపల్లి నుంచి, గోవిందరాజు ఎటునాగారం మండలం కొండాయి గ్రామం నుంచి, పగిడిద్ద రాజు గంగారం మండలం హనుగోండ్ల గ్రామం నుంచి గద్దెలపైకి వస్తారు. 17వ తేదీ గురువారం సమ్మక్క వనదేవత చిలుకల గట్టు నుంచి గద్దెపైకి చేరుతుంది. 18వ తేదీశుక్రవారం వనదేవతలకు మొక్కులు సమర్పించుట. 19వ తేదీశనివారం రోజున సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు వన దేవతలు, వన ప్రవేశం జరుగుతాయని తెలిపారు. ఈసారి మేడారం మహా జాతర తేదీలు 10 నెలల ముందు జాతర తేదీలను ప్రకటించడం విశేషం.

ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారుల సంఘం ప్రధానకార్యదర్శి చంద గోపాల్, పూజారులు కొక్కెర కృష్ణయ్య, సిద్ధబోయిన స్వామి, సిద్ధ
బోయిన ముజెందర్, సారయ్య, సిద్దబోయిన లక్ష్మణ్ రావు, సిద్ధబోయిన అరుణ్, మల్లెల ముత్తయ్య, బొక్కెన, పాపారావు, ఎండోమెంట్ సిబ్బంది క్రాంతి, రాజేశ్వరరావు, కిషన్, వీరన్న, బాలకృష్ణ, రఘుపతి, రమాదేవి ఎండోమెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మేడారం లో మే 1వ తేదీ నుంచి లాక్ డౌన్

మేడారం లో వచ్చే మే 1వ తారీకు నుంచి 15 తారీకు వరకు అనగా 15 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, మేడారం ఈవో రాజేంద్రం తెలిపారు. భక్తులు దర్శింనాలను వాయిదా వేసుకోని సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement