విశాఖ-బెంగుళూరు మార్గంలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ప్రకటించింది. విశాఖపట్నం బెంగుళూరు మధ్య ఆగష్టు -సెప్టెంబర్ మధ్యకాలంలో దాదాపు 16 రైళ్లను నడుపనున్నారు. వేసవిలో ప్రారంభించిన ప్రత్యేక రైళ్లను సైతం రద్దీ నేపథ్యంలో రైల్వే శాఖ దశల వారీగా కొనసాగిస్తోంది. ట్రైన్ నంబర్ 08543 విశాఖపట్నం -బెంగళూరుల మధ్య ఆగష్టు 7,14,21,28, సెప్టెంబర్ 4,11,18,25 తేదీలలో మధ్యాహ్నం 3.55కు రైలు బయలుదేరి మర్నాడు ఉదయం 9గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. రిటర్స్ ట్రైన్ నంబర్ 08544 రైలు బెంగళూరు-విశాఖపట్నం మధ్య నడుస్తుంది. బెంగళూరులో మధ్యాహ్నం 3.50కు బయలుదేరే ఈ రైలు మర్నాడు ఉదయం 11గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఆగష్టు 8,15,22,29,5,12,19,26 తేదీలలో బెంగళూరు నుంచి బయలుదేరుతుంది.
విశాఖ-బెంగళూరు మధ్య నడిచే ప్రత్యేక రైలు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలారిపేట్, బంగారుపేట్, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది. విశాఖ-బెంగుళూరు ప్రత్యేక రైలులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, సెకండ్ సీటింగ్ బోగీలు ఉంటాయి.
కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా రెగ్యులర్ రైళ్లు అందుబాటులో లేకపోవడంతో దేశవ్యాప్తంగా రాకపోకలు నిలిచిపోయాయి. దశలవారీగా రైళ్లను పునరుద్ధరిస్తున్న కేంద్రం ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లను నడుపుతోంది. సాధారణ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లు కూడా పూర్తి స్థాయి సామర్ధ్యంతో నడుపుతున్నారు. దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలతో ప్రయాణాలను కొనసాగిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.